హ్యాపీ బర్త్‌డే పాప: వరుణ్‌ తేజ్‌

18 Dec, 2019 19:47 IST|Sakshi

నిహారిక కొణిదెల.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురిగా నిహారిక దాదాపు అందరికీ సుపరిచితురాలే. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. వరుసగా చేసిన మూడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా సరేనంటూ తన సినిమా హిట్టు ఫ్లాఫులతో సంబంధం లేకుండా సినీ రంగంలోనే ఉండాలని నిర్ణయించుకుంది.

అందుకోసం నటిగా కాస్త విరామం ఇచ్చి నిర్మాతగానూ అవతారమెత్తింది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా పలు షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తోంది. ఇక ఈ యేడాది ఆమె చివరిగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’ మంచి టాక్‌నే సంపాదించుకుంది. నేడు ఈ సూర్యకాంతం 26వ యేట అడుగుపెట్టింది. దీంతో వరుణ్‌ తేజ్‌ తన సోదరి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు. అతని ప్రేమకు ఎంతగానో సంతోషించిన నిహారిక వరుణ్‌కు ఆప్యాయంగా ముద్దుపెట్టింది. ఈ ఫొటోలను వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

సినిమా

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి