సాధనే ఆయుధం

3 Mar, 2019 01:36 IST|Sakshi

రింగులో బాక్సర్‌ శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా బలంగా ఉండాలి. లేకపోతే ప్రత్యర్థిదే విజయం. బరిలో గెలవాలంటే సరైన సాధనే ఆయుధం. అందుకే ఇటు మానసికంగా అటు సాధనపరంగా రాజీ పడటం లేదు వరుణ్‌ తేజ్‌. బాగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వరుణ్‌తేజ్‌ పడుతున్న ఈ శ్రమ అంతా ఆయన బాక్సర్‌గా నటించబోతున్న చిత్రం కోసమే. కిరణ్‌ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా నటించనున్నారు.

ఇందుకోసం కాలిఫోర్నియాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్‌. ‘‘పది రౌండ్ల బాక్సింగ్‌ సాధన చేసిన తర్వాత నేను’’ అనే క్యాప్షన్‌తో ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు వరుణ్‌. అక్కడినుంచి వరుణ్‌ తిరిగొచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు