మిస్టర్కు కత్తెర..!

16 Apr, 2017 11:08 IST|Sakshi
మిస్టర్కు కత్తెర..!

వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్లోని కొన్ని సీన్స్ సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించాయని భావిస్తున్న చిత్రయూనిట్, ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. అనవసరమైన కామెడీ సీన్స్తో పాటు కొన్ని బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఫస్ట్ హాఫ్లో రిచ్ విజువల్స్తో పాటు కామెడీ కూడా బాగానే వర్క్ అవుట్ కావటంతో సెకండ్హాఫ్లో పది నిమిషాల మేర ట్రిమ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం యూనిట్ సభ్యులు ఇదే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో కమర్షియల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొవచ్చని భావించిన వరుణ్ మిస్టర్ టాక్పై అసంతృప్తిగా ఉన్నాడు. తన కెరీర్కు ఎంతో కీలకమైన సినిమా అయినా.. శ్రీనువైట్ల కూడా రొటీన్ ఫార్ములాలో ఫాలో అవ్వటం అభిమానులను నిరాశపరిచింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి