నాని డైరెక్టర్‌తో మెగా హీరో

9 Nov, 2017 16:06 IST|Sakshi

ఫిదా సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన మెగా హీరో వరుణ్‌​ తేజ్‌ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న వరుణ్‌, మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడు. మాస్‌ హీరో ఇమేజ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్‌ అయిన ఈ యువ నటుడు ముందు లవర్‌ బాయ్‌ గా ప్రూవ్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వరుసగా రొమాటింక్‌ ఎంటర్‌టైనర్‌ లను సెలెక్ట్‌ చేసుకుంటున్నాడు. అదే బాటలో యువ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమాకు అంగీకరించాడు.

నాని హీరోగా నిన్నుకోరి లాంటి మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరిని తెరకెక్కించిన శివ నిర్వాణ వరుణ్‌తో తెరకెక్కించబోయే సినిమాలో మాత్రం కాస్తం ఎంటర్‌టైన్మెంట్‌ కూడా జోడిస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ ను డీవీవీ దానయ్య నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న వరుణ్‌, సెట్స్‌ మీద ఉన్న సినిమా పూర్తయిన తరువాతే కొత్త సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు