వరుణ్‌ సంకల్పం

15 Dec, 2017 00:20 IST|Sakshi

ఘాజీతో తొలిసారి ‘వార్‌ ఎట్‌ సీ ఫిలిం’ అంటూ  తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా సంచలన ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్‌ రెడ్డి మరోసారి ఆడియన్స్‌ను అబ్బురపరచటానికి సిద్ధమయ్యారు. సంకల్ప్‌ తదుపరి చిత్రం వరుణ్‌ తేజ్‌తో అని తెలిసిన విషయమే. ఈ విషయమై సంకల్ప్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘‘ఇది సైన్స్‌ ఫిక్షన్‌కు సంబంధించిన కథాంశం. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ‘ఘాజీ ’లాగే ఈ సినిమాలో కూడా ఎక్కువ సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) వర్క్‌ ఉంటుంది. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘తొలి ప్రేమ’ రిలీజ్‌ తర్వాత మార్చ్‌ లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తాం’’ అని కొన్ని వివరాలు చెప్పారు.

‘ఘాజీ’తో నీళ్ళ లోపలికి తీసుకువెళ్లిన సంకల్ప్‌ ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకాశ వీధుల్లో విహారానికి తీసుకెళ్తారనమాట. ‘ఘాజీ’ని నిర్మించిన పీవీపీ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించొచ్చట. ఇందులో వరుణ్‌ వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌)గా కనిపిస్తారట. అవునా.. అంటే ‘అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌’ అన్నారు సంకల్ప్‌ రెడ్డి. 

మరిన్ని వార్తలు