బాక్సర్‌గా మెగా హీరో..!

22 Dec, 2018 10:35 IST|Sakshi

అంతరిక్షం సినిమాతో మరోసారి ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌, తదుపరి చిత్రంలోనే ప్రయోగానికే రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎఫ్‌ 2లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న ఈ యంగ్‌ హీరో తరువాత ఓ స్పోర్ట్స్‌ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు. కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాతో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడట.

ఈ సినిమాను అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సీనియర్‌ హీరో వెంకటేష్‌తో కలిసి వరుణ్‌ నటిస్తున్న ఎఫ్‌ 2 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు జోడిగా మెహరీన్‌ నటిస్తోంది.

మరిన్ని వార్తలు