పంచ్‌ పడుద్ది!

12 Mar, 2019 02:02 IST|Sakshi
వరుణ్‌ తేజ్

‘ఎఫ్‌ 2’లో ప్రేక్షకుల మీద కామెడీ పంచ్‌లు విసిరిన వరుణ్‌ తేజ్, లేటెస్ట్‌గా సీరియస్‌గా బాక్సింగ్‌ పంచ్‌లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. తదుపరి చిత్రంలో బాక్సర్‌గా కనిపిస్తారని తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేశ్, సిద్దు నిర్మిస్తారు. ఆల్రెడీ అమెరికాలో బాక్సింగ్‌ క్లాసులతో ఫుల్‌ బిజీగా ఉన్నారు వరుణ్‌. హాలీవుడ్‌ చిత్రాలు ‘క్రీడ్, కార్ల్‌ వెదర్స్‌’ వంటి చిత్రాలకు యాక్షన్‌ సీక్వెన్స్‌ను కొరియోగ్రాఫ్‌ చేసిన టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు పని చేయనున్నారు.

అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్నటువంటి బాక్సర్‌ టోనీ జఫ్రీస్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్‌. ఇందులో ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్, కన్నడ స్టార్‌ ఉపేంద్ర, రమ్యకృష్ణ, సత్యరాజ్, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి లను కీలకపాత్రల కోసం చిత్రవర్గాలు సంప్రదించినట్టు సమాచారం. తొలిసినిమా అయినప్పటికీ క్యాస్టింగ్‌తోనే ప్రాజెక్ట్‌ను ఎగై్జటింగ్‌గా తయారు చేశారు. ఈ   చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మరోవైపు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రంలోనూ నటించనున్నారు వరుణ్‌ తేజ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు