వరుణ్‌తేజ్ హీరోగా వైజయంతీ మూవీస్ సినిమా

10 Jul, 2013 03:09 IST|Sakshi
వరుణ్‌తేజ్ హీరోగా వైజయంతీ మూవీస్ సినిమా
మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్ లాంటి స్టార్‌లను హీరోలుగా తెరకు పరిచయం చేసిన ఘనత అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ది. త్వరలో ఆయన మరో నటవారసుణ్ణి వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. అతనే వరుణ్‌తేజ్. మెగాబ్రదర్ నాగబాబు తనయుడైన వరుణ్‌తేజ్ తెరంగేట్రంపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. 
 
 శ్రీకాంత్ అడ్డాల, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని గతంలో వార్తలు కూడా వినిపించాయి. ఎట్టకేలకు వరుణ్ తొలి సినిమాపై ఉన్న మీమాంసకు తెరదించారు అశ్వనీదత్. వరుణ్‌తేజ్ హీరోగా పరిచయమయ్యే ఈ చిత్రానికి జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహించనున్నారు. 
 
 గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాల ద్వారా అటు అవార్డులను, ఇటు రివార్డులనూ సొంతం చేసుకొని దక్షిణాదిలోని స్టార్ డెరైక్టర్లలో ఒకరిగా ఎదిగిన క్రిష్... వరుణ్ కోసం ఓ అద్భుతమైన కథ తయారు చేశారని, క్రిష్ చిత్రాల్లో ఉండే సామాజికాంశాలతో పాటు, వాణిజ్య అంశాలు కూడా ఇందులో మెండుగా ఉంటాయని అశ్వనీదత్ ‘సాక్షి’కి తెలిపారు. 
 
 ఇందులో వరుణ్ హీరోయిజం పతాకస్థాయిలో ఉంటుందని, మాస్‌ని మెప్పించేలా క్రిష్ ఈ చిత్రాన్ని మలచనున్నారని ఆయన అన్నారు. ఆగస్ట్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లండన్, స్విట్జర్లాండ్‌లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతామని, నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని అశ్వనీదత్ చెప్పారు. ఇద్దరు కథానాయికలు నటించే ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబి, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: వైజయంతీ మూవీస్.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ