లవ్‌ జర్నీలో మిస్టర్‌!

12 Mar, 2017 23:24 IST|Sakshi
లవ్‌ జర్నీలో మిస్టర్‌!

మాంచి హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు కదా ఈ ‘మిస్టర్‌’. వయసు కూడా ఎక్కువేం కాదు. జస్ట్‌ 27 ఏళ్లే. కానీ, ‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే... ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనే పెద్ద ఫిలాసఫీ స్టేట్మెంట్‌ ఇస్తాడు. దీనికి ఓ కారణం ఉంది. ఇతడికి ఇద్దరమ్మాయిలు పరిచయమవుతారు. ఓ అమ్మాయి విదేశాల్లో.. ఇంకో అమ్మాయి తెలుగు పల్లెలో! ఈ మిస్టర్‌ ఎవరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లాడు? ఎవరి ప్రేమ మనోడ్ని వెతుక్కుంటూ వచ్చిందనేది ఏప్రిల్‌ 14న తెలుస్తుంది.

 వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీనుౖ వెట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్‌’. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరోయిన్లు. ఏప్రిల్‌ 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘మంచి ఎమోషన్స్, హిలేరియస్‌ కామెడీ, మ్యూజిక్, బ్యూటిఫుల్‌ విజువల్స్‌కి స్కోప్‌ ఉన్న కథ. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.

 నేను ఏదైతే అనుకున్నానో... దాన్ని వంద శాతం రాజీ పడకుండా తీయగలిగాను. అందుకు కారణమైన నా నిర్మాతలు, చిత్రబృందానికి థ్యాంక్స్‌. నిన్ననే ఫస్ట్‌ హాఫ్‌ రీ–రికార్డింగ్‌తో చూశా. మిక్కి జె. మేయర్‌ అన్‌ బిలీవబుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశారు. ఆరు అద్భుతమైన పాటలు అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్‌ సీపాన, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్‌: రూపా వైట్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా