నేనే చెబుతా

7 Jan, 2018 00:44 IST|Sakshi

... అప్పటి వరకు వెయిట్‌ చేయండి. నా నెక్ట్స్‌ సినిమా గురించి ఊహాగానాలను, గాసిప్‌లను నమ్మొద్దు అంటున్నారు హీరో వరుణ్‌తేజ్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందుతున్న ‘తొలిప్రేమ’ సినిమా పూర్తి కావచ్చింది. ఫిబ్రవరి 9న రిలీజ్‌ కానుంది. దీంతో వరుణ్‌తేజ్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ఊహగానాలు మొదలయ్యాయి. ‘‘నా కొత్త ప్రాజెక్ట్‌ ఇంకా ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. ఓకే అయితే నేనే చెబుతాను’’ అని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు వరుణ్‌.

మరిన్ని వార్తలు