బాక్సర్‌ వరుణ్‌!

23 Dec, 2018 02:57 IST|Sakshi
వరుణ్‌ తేజ్‌

బాక్సర్‌గా హీరో వరుణ్‌ తేజ్‌ హైట్‌ అండ్‌ వెయిట్‌ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతాయి. ఫుట్‌బాల్, క్రికెట్‌.. ఇలా విభిన్న రకాల స్పోర్ట్స్‌ ఉండగా ఒక్క బాక్సింగ్‌నే ఎందుకు పాయింట్‌ అవుట్‌ చేస్తున్నామనేగా మీ డౌట్‌. అక్కడికే వస్తున్నాం. వరుణ్‌ తేజ్‌ హీరోగా స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కిరణ్‌ కొర్రపాటి దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు శ్రీనుౖ వెట్ల దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్‌’, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘తొలిప్రేమ’ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారట కిరణ్‌.

‘మిస్టర్, తొలిప్రేమ’ ఈ రెండు చిత్రాల్లో వరుణ్‌ తేజ్‌నే హీరో అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడు అల్లు వెంకటేశ్‌ (అల్లు బాబీ) ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తారని సమాచారం. రీసెంట్‌గా ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పీహెచ్‌’ సినిమాలో అంతరిక్షంలోకి వెళ్లిన వరుణ్‌ ఇప్పుడు బాక్సింగ్‌ రింగులోకి దిగనున్నారన్నమాట. ఇక వెంకటేశ్‌తో కలిసి వరుణ్‌ నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు