నేను చాలా లక్కీ

28 Nov, 2014 02:47 IST|Sakshi
నేను చాలా లక్కీ

ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని అంటోంది నటి వేదిక. పరదేశి చిత్రంలో అద్భుతమైన అభినయాన్ని చాటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం కావ్య తలైవన్. సిద్ధార్థ్, పృథ్విరాజ్‌లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా అనైక నటించారు. వసంతబాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. వేదిక తన అనుభవాలను చెప్పింది.
 
అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు నటించే చాన్సు చాలా తక్కువమందికే లభిస్తుం ది. ఆ విధంగా చూస్తే నేను చాలా లక్కీ. పరదేశి చిత్రంలో కొండప్రాంత వాసిగా నటనకు అవకాశం వున్న పాత్ర పోషించాను. ఆ పాత్ర కోసం నా రూపురేఖలన్నీ మార్చుకుని నటించాను. చాలామంది అభినందనలు పొందా ను. తాజా చిత్రం కావ్యతలైవన్ చిత్రంలో రంగస్థల నటిగా నటించాను. ఇది 1930 ప్రాంతంలో జరిగే నాటకాల బృందం ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం. నిజం చెప్పాలంటే ప్రఖ్యాత నటీమణి కె.పి.సుందరాంబాల్‌ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన పాత్ర ఇది. 1940 ప్రాంతంలో నాటకా ల్లో స్త్రీ పాత్రల్ని కూడా మగవారే పోషించేవారు.

అలాంటి పరిస్థితిలో నాటకాల్లో నటించడానికి ముందుకొచ్చిన తొలి నటీమణి కేపీ సుందరాంబాల్. కావ్యతలైవన్ చిత్రం లో నటించడానికి ముందు ఈ విషయం తెలుసుకున్నాను. అయితే ఈ తరహా పాత్రలో నటించడం అంత సులభం కాదు అని అనుభవపూర్వకంగా గ్రహించాను. ధరించే దుస్తుల నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేకప్ కోసం గంటల సమయం వెచ్చించాను. ఈ చిత్రంలో నటించేముందు పాత క్లాసికల్ చిత్రాలు పలు తిలకించాను. కావ్యతలైవన్ చిత్రం లో నటించడం చాలా కొత్త అనుభ వం. చిత్రం చూసే ప్రేక్షకులకు వినూత్న అనుభవం కలుగుతోందనే నమ్మకం ఉంది. మరో విషయం ఏమిటంటే రంగస్థల కళాకారుల ఇతివృత్తం అనగానే ఇదేదో సీనియర్ డ్రామాతో కూడిన చిత్రం అనుకుంటారు.

సహనటులు సిద్ధార్థ్, పృథ్విరాజ్‌ల గురించి చెప్పాలంటే చాలా డెడికేటెడ్‌గా శ్రమించి నటించారు. వారిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండడంతో చిత్రంలో మంచి అవుట్‌పుట్ వచ్చింది. ప్రముఖ నృత్యదర్శకుడు రఘురాం కన్నుమూసే ముందు ఈ చిత్రంలో నా పరిచయం పాటకు నృత్య దర్శకత్వం వహించారు.  కావ్యతలైవన్ నా సినీ కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నానని వేదిక పేర్కొన్నారు.