తెర వెనుక తెలుగు సినిమా

17 Feb, 2014 00:25 IST|Sakshi
తెర వెనుక తెలుగు సినిమా
‘‘చిత్ర పరిశ్రమలో పదేళ్లపాటు ఉంటే చాలు.. వారికి ఎన్నో గొప్ప అనుభవాలు ఎదురవుతాయి. వాటికి ఓ పుస్తక రూపాన్నిస్తే అది మహాగ్రంథమే అవుతుంది. తెర వెనక జరిగిన ఎన్నో సంఘటనల సమాహారంగా ప్రచురించబడ్డ ఈ పుస్తకానికి ‘నేను చూసిన తెరవెనుక తెలుగు సినిమా’ అనే పేరు పెడితే బాగుండేది’’ అని దాసరి నారాయణరావు అభిప్రాయపడ్డారు. పబ్లిసిటీ ఇన్‌చార్జ్ ప్రమోద్‌కుమార్ రచించిన ‘తెర వెనుక తెలుగు సినిమా’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించి, దాసరి, మోహన్‌బాబు, ఈశ్వర్‌లకు అందించారు.
 
 ఇంకా దాసరి మాట్లాడుతూ- ‘‘ప్రమోద్‌కు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నుంచి ప్రముఖ దర్శక, నిర్మాతలందరితో సాన్నిహిత్యం ఉంది. సినీ రంగంలో తెర వెనుక జరిగిన ఎన్నో అనుభవాలను ఈ పుస్తకంలో క్రోడీకరించాడు’’ అన్నారు. పలువురు చిత్రరంగ ప్రముఖుల సహకారంతో ఈ పుస్తకాన్ని రాయగలిగానని ప్రమోద్‌కుమార్ చెప్పారు. ప్రమోద్ తనకు అన్నలాంటివారని, ఆయన పుస్తకం రచించడం ఆనందంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. ఇంకా పలువురు చిత్రరంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.