దేశభక్తిని రగిలించే చిత్రం ‘సైరా’

17 Oct, 2019 04:29 IST|Sakshi

‘సైరా నరసింహారెడ్డి’పై వెంకయ్య ప్రశంసలు

కుటుంబసభ్యులు, చిరంజీవితో కలిసి చిత్రాన్ని వీక్షించిన ఉపరాష్ట్రపతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశభక్తిని రగిలించే చిత్రాల కొరతను సైరా నరసింహారెడ్డి తీర్చగలుగుతుం దని భావిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. జాతీయ భావాన్ని పెంపొందించే చిత్రాలు తగ్గిపోయాయని, ఇలాంటి తరుణంలో ఉయ్యాలవాడ నరసిం హారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహా రెడ్డి సినిమాను అందించడం సంతోషకరమ న్నారు. వెంకయ్య నాయుడు బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులు, మెగాస్టార్‌ చిరంజీవి, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వలస పాలకుల దుర్మార్గాలను, అరాచకాలను చక్కగా తెరకెక్కించారని, అంతర్గత కలహాలు, స్వార్థం వల్లే గతంలో మనం స్వాతంత్య్రాన్ని కోల్పోయామన్న సందేశం చిత్రంలో ఇమిడి ఉందన్నారు. ఇంతటి మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత రామ్‌చరణ్, చిత్రా న్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్‌రెడ్డిని అభినందించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ‘మనమిద్దరం రాజకీ యాలు వదిలేశాం.. ఇక ముందు మీరు ఇలాంటి మరెన్నో చిత్రాల్లో నటించి ప్రజలను రంజింపజేయాలి’ అని చిరంజీవికి సలహా ఇచ్చినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు.

సంతోషంగా ఉంది
సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రజల మన్ననలు పొందడం సంతోషంగా ఉందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఉపరాష్ట్రపతి ఈ చిత్రాన్ని వీక్షించడం ఎంతో సంతృíప్తినిచ్చిందన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను కూడా కలిసి ‘సైరా’ను వీక్షించాలని చిరంజీవి కోరనున్నట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు