ప్రేమ పోరాటం

28 Jun, 2013 17:16 IST|Sakshi
ప్రేమ పోరాటం
మహి, అఖిల జంటగా శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై చెరువుపల్లి వెంకట సుమన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ -‘‘ఆయుధం పట్టకుండా ప్రేమను గెలిచే యువకుడి కథ ఇది.
 
 వచ్చే నెలలో చిత్రీకరణ మొదలుపెట్టి, దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. పూర్తి స్థాయి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నందుకు హీరో హీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. 
 
 మంచి పాత్రలు చేస్తున్నామని కొండవలస, గీతాసింగ్ చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: పనసాల, కెమెరా: ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సీహెచ్ మహేంద్ర, సమర్పణ: మంద సంగ్రామ్.