మరో మల్టీ స్టారర్‌ మొదలైంది!

11 Jul, 2018 11:09 IST|Sakshi

జై లవ కుశ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన బాబీ(కె.యస్‌. రవీంద్ర) కొంత గ్యాప్‌ తరువాత తన కొత్త సినిమాను ప్రారంభించారు. మల్టీ స్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో వెంకటేష్‌, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది.

సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ను ఫైనల్‌ చేయాల్సి ఉంది.  ఈసినిమాకు వెంకీ మామ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్‌ తో కలిసి నటిస్తుండగా, చైతూ సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు