‘వీలైనంత త్వరగా వాళ్లిద్దరినీ విడదీయాలి’

7 Dec, 2019 20:51 IST|Sakshi

విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘వెంకీ మామ’. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ సినిమాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, పాటలు అన్ని వర్గాల ప్రజలకు కనెక్ట్‌ అయ్యాయి. విడుదలకు మరో వారం రోజుల ఉండటంతో మూవీ ప్రమోషన్స్‌ వేగం పెంచాయి చిత్ర యూనిట్‌. దీనిలో భాగంగా ఖమ్మంలో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహించారు. ఇదే ఈవెంట్‌లో ‘వెంకీ మామ’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌, లవ్‌, రొమాన్స్‌, రిలేషన్‌షిప్‌, మాస్‌ ఇలా అన్నింటిని మేళవించిన ఈ ట్రైలర్‌ అందరినీ కట్టిపడేసింది. ‘మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం’అని విక్టరీ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది.  ‘నీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు మామయ్యా.. అది నీ వల్ల కూడా కాదు’అని నాగచైతన్య చెప్పే ఎమోషనల్‌ డైలాగ్‌, ‘నీ లవ్‌ స్టోరీ చాలా అందంగా ఉందిరా’ అంటూ చెప్పే ఫీలున్న డైలాగ్‌, ‘ఈ సారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంతో ఎరుపెక్కిస్తా రండ్రా నా..’అంటూ వెంకీ చెప్పే ఊర మాస్‌ డైలాగ్‌, ‘దయచేసి వాడికొక అత్తనివ్వండి అన్నయ్య’అంటూ హైపర్‌ ఆది చెప్పే కామెడీ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.

ప్రస్తుతం ఈ ట్రైలర్‌ను నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక మామా అల్లుళ్ల ఖాతాలో భారీ విజయం ఖాయమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  కాగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ‘వెంకీ మామ’ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య, వెంకీ సరసన రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్‌, రావు రమేశ్‌  చమ్మక్‌ చంద్ర, హైపర్‌ ఆది తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్‌ 13న విడుదల కానున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతమందిస్తున్నాడు.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా