అనాథ పిల్లలకు ‘వెంకీ’మామ గిఫ్ట్‌

24 Dec, 2019 18:21 IST|Sakshi

రియల్‌ లైఫ్‌ మామ అల్లుడు విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కలిసి నటించిన ‘వెంకీమామ’ బాక్సాఫీస్‌ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. కడుపుబ్బా నవ్విస్తున్న ఈ చిత్రం సినిమా యూనిట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా వెంకీ అనాథ పిల్లలను కలిసి వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆ పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు వెంకీతో సెల్ఫీలు తీసుకుని ఆనందపడ్డారు. అనాథ పిల్లల ప్రేమను చూసిన వెంకీ వారిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. 

అనంతరం వాళ్లందరి కోసం ‘వెంకీమామ’ ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. వారికి క్రిస్‌మస్‌ కానుకలను కూడా అందించాడు. దీంతో ఊహించని సర్‌ప్రైజ్‌కు అనాథ పిల్లలు ఎంతగానో సంతోషించారు. ప్రస్తుతం వెంకీ వారితో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబరు 13న విడుదలైన వెంకీమామ జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ చిత్రంలో మామ వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, అల్లుడు నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటించారు. (చదవండి: మామాఅల్లుళ్ల జోష్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు