గురు లుక్ అదిరింది

18 Sep, 2016 10:33 IST|Sakshi
గురు లుక్ అదిరింది

బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న సీనియర్ హీరో వెంకటేష్ తన నెక్ట్స్ సినిమాను మొదలెట్టేస్తున్నాడు. తమిళ హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగు సినిమా కూడా రూపొందనుంది.

గతంలో సినిమా కోసం తన ఫిజిక్ విషయంలో భారీ మార్పుల చేయని వెంకీ ఈ సినిమా కోసం కాస్త వేరియేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ గా నటిస్తుండటంతో అందుకు తగ్గట్టుగా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు వెంకీ. ఈ నెల 19నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెలుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రానా రిలీజ్ చేశాడు. గురు పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో రితికా సింగ్ కీలక పాత్రలో నటిస్తోంది.