బీచ్ రోడ్డులో...

12 Nov, 2016 22:58 IST|Sakshi
బీచ్ రోడ్డులో...

శుక్రవారం ఉదయం విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో ట్రాఫిక్ నార్మల్‌గానే ఉంది. కానీ, కాసేపటికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వెంకటేశ్ రావడంతో ఆ ఏరియా అంతా కోలాహలంగా మారింది. ట్రాఫిక్ జామ్ కావడంతో బౌన్సర్లు వెంకీకి రక్షణగా రంగంలోకి దిగారు. అసలు వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న సినిమా ‘గురు’.

మాధవన్ హీరోగా సుధా కొంగర తీసిన తమిళ సినిమా ‘ఇరుది సుట్రు’కి తెలుగు రీమేక్ ఇది. విశాఖలో భీమిలి బీచ్ రోడ్డులో వెంకటేశ్ జాగింగ్ చేస్తున్న దృశ్యాలతో పాటు బైక్‌పై వెళ్తున్న సీన్స్, బోయవీధిలో కిక్ బాక్సింగ్ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయిన్ రితికా సింగ్, సీనియర్ నటుడు నాజర్ తదితరులు చిత్రీకరణలో పాల్గొన్నారు. తరువాతి షెడ్యూల్ చెన్నైలో మొదలుకానుంది.