వెంకీమామ.. వచ్చే నెల మొదలమ్మా

28 Oct, 2018 05:44 IST|Sakshi
వెంకటేశ్‌,నాగచైతన్య

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీమామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లదనే పుకార్లు పుట్టుకొచ్చాయి.

ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘వెంకీమామ’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లదనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ప్రమోషన్స్, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే వెంకటేశ్‌ ‘ఎఫ్‌ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ‘వెంకీమామ’ సినిమా చిత్రీకరణ వచ్చే నెల సెకండ్‌ వీక్‌లో స్టార్ట్‌ కానుందట. ‘‘ఈ సినిమా పనులతో బాబీ బిజీగా ఉన్నాడు. వచ్చే నెల  షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. వచ్చే ఏడాది ఓ మంచి ఎంటర్‌టైనర్‌ని ఇవ్వబోతున్నామనే నమ్మకంతో అందరం పని చేస్తున్నాం’’ అన్నారు కోన వెంకట్‌.

మరిన్ని వార్తలు