నవంబర్‌ నుంచి మామ అల్లుళ్ల మల్టీస్టారర్‌

25 Oct, 2018 11:07 IST|Sakshi

సీనియర్‌ హీరో వెంకటేష్‌, యువ కథానాయకుడు నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ మూవీ వెంకీ మామ. నిజజీవితంలో కూడా మామా అల్లుళ్లైన వెంకీ, చైతూలు ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌.. కోన వెంకట్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకుడు.

జై లవ కుశ లాంటి సూపర్‌ హిట్ తరువాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో వెంకీ మామపై మంచి హైప్ క్రియేట్‌ అయ్యింది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీలో చైతూ సరసన రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా వెంకటేష్‌కు జోడిగా బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ నటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు