నవంబరులో రేస్‌

25 Sep, 2019 01:30 IST|Sakshi

‘గురు’ (2017) చిత్రంలో బాక్సింగ్‌ కోచ్‌గా వెంకటేశ్‌ నటన సూపర్‌ అని ఆడియన్స్‌ కితాబులిచ్చారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ వెంకీ క్రీడా నేపథ్యంలో ఉన్న చిత్రంలో నటించనున్నారని సమాచారం. హార్స్‌ రేసింగ్‌ ప్రధానాంశంగా సాగే ఓ ఎమోషనల్‌ ఎంటర్‌టైనింగ్‌ స్టోరీకి వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలిసింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట హార్స్‌ క్లబ్‌ నేపథ్యంలో స్క్రిప్ట్‌ రెడీ చేశారట తరుణ్‌. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న ఈ సినిమా ఈ నవంబరులో మొదలవుతుందట. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు వెంకటేశ్‌. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య మరో హీరో.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు