స్క్రీన్‌ టెస్ట్‌

24 Oct, 2017 01:23 IST|Sakshi

► హిందీ ‘బందిష్‌’ చిత్రంలో కాలేజ్‌ స్టూడెంట్‌గా చిన్న పాత్రలో నటించిన ఈ నటుడు తర్వాత కాలంలో చాలా పెద్ద హీరో అయ్యారు? ఆ హీరో ఎవరో తెలుసా?
ఎ) నాగార్జున   బి) జగపతిబాబు   సి) రవితేజ   డి) వెంకటేశ్‌

► మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే... మనసున్న మనిషికి సుఖములేదంతే’ ఈ పాటను రచించిన గీత రచయిత ఎవరు?
ఎ) సి. నారాయణ రెడ్డి  బి) కొసరాజు  సి) ఆచార్య ఆత్రేయ డి) సముద్రాల రాఘవాచార్య

► హీరో తరుణ్‌ తండ్రి పేరు చక్రపాణి. ఆయన ఓ భాషలో హీరోగా చాలా సినిమాల్లో నటించారు. ఆ లాంగ్వేజ్‌ చెబుతారా?
ఎ) మరాఠి     బి) తమిళ     సి) ఒరియా    డి) మలయాళం

► నటుడు నవదీప్, కాజల్‌ అగర్వాల్‌ ఒక చిత్రంలోజంటగా నటించారు. ఆ చిత్రానికి దర్శకుడెవరు?
ఎ) తేజ బి) కృష్ణవంశీ  సి) పూరి జగన్నాథ్‌  డి) వైవీయస్‌ చౌదరి

► డాన్స్‌మాస్టర్‌గా, దర్శకుడిగా రాఘవ లారెన్స్‌సుపరిచితుడే. ఆయన సంగీత దర్శకుడిగా చేసిన మొదటి సినిమా ఏది?
ఎ) మాస్‌     బి) డాన్‌  సి) కాంచన    డి) రెబల్‌

► ‘వదిలేస్తున్నావా నన్ను’ అని హీరోయిన్‌ అడిగితే ‘లవ్‌ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవల్‌ లేదు’ అని చెప్తాడు హీరో నితిన్‌. ఏ హీరోయిన్‌తో ఈ డైలాగ్‌ చెప్పారు?
ఎ) సమంత బి) అనుపమా పరమేశ్వరన్‌  సి) నిత్యామీనన్‌ డి) పూజా హెగ్డే

► ప్రస్తుత క్యారెక్టర్‌ నటి శరణ్య, కమల్‌హాసన్‌ ‘ఏదో తెలియని బంధమిది’ అంటూ రొమాంటిక్‌ మెలోడి సాంగ్‌లో నటించారు? ఆ సినిమా పేరేంటో కనుక్కోండి?
ఎ) నాయకుడు బి) దళపతి సి) మైఖేల్‌ మదన కామరాజు డి) పుష్పక విమానం

► సురేశ్‌ ప్రొడక్షన్‌లో నాగార్జున ఒకే ఒక చిత్రంలో నటించారు? ఆ సినిమా ఏంటి?
ఎ) చినబాబు   బి) క్రిమినల్‌  సి) శివ    డి) చైతన్య

► ‘ఆలీబాబా 40 దొంగలు’ సినిమాలో యన్టీఆర్‌తోకలిసి నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) బి. సరోజాదేవి     బి) జయలలిత సి) మంజుల     డి) భానుమతి

► తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన ఐశ్వర్య ఈ పాత తరం హీరోయిన్‌ కూతురు? ఆ హీరోయిన్‌ ఎవరు?
ఎ) చంద్రకళ   బి) షావుకారు జానకి    సి) కృష్ణకుమారి   డి) లక్ష్మీ

► ఇప్పుడు సహాయనటుడిగా పనిచేస్తున్న రవి ప్రకాశ్‌ మొదట హీరోగా పరిచయమయ్యాడు. అతను ఏ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడో తెలుసా?
ఎ) శుభలేఖ బి) శుభసంకల్పం సి) శుభవేళ డి) శుభకరం

► ‘నూటొక్క జిల్లాలకు అందగాణ్ణి’ అనే ఫేమస్‌ డైలాగ్‌తో ఈ నటుడు పాపులర్‌. ఆయనెవరో గుర్తుందా?
ఎ) కోట శ్రీనివాసరావు  బి) బ్రహ్మానందం సి) నూతన్‌ ప్రసాద్‌   డి) సుత్తివేలు

► ‘బొబ్బిలి యుధ్ధం’ చిత్రంలో ‘తాండ్ర పాపారాయుడు’ పాత్రను పోషించిన నటుడెవరు?
ఎ) యస్‌స్వీ రంగారావు బి) మిక్కిలినేని సి) గుమ్మడి డి) ప్రభాకర్‌ రెడ్డి

► ఈ కామెడీ నటుడు టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేశారు? ఆయనెవరో కనుక్కోండి?
ఎ) బాలకృష్ణ (ఓల్డ్‌)    బి) మాడా    సి) వేణుమాధవ్‌    డి) రాజబాబు

► హీరో రామ్‌ ట్విట్టర్‌ ఐడీ ఏంటో తెలుసా?
ఎ) రామ్‌ సినిమాస్‌ బి) రామ్‌సేస్‌ సి) రామ్‌ పోతినేని డి) మీరామ్‌

► మల్లంపల్లి చంద్రశేఖర్‌ అన్నది ఈ నటుడి అసలు పేరు. ఆయన స్క్రీన్‌ నేమ్‌ తెలుసా?
ఎ) చిట్టిబాబు   బి) చంద్రమౌళి   సి) చంద్రమోహన్‌   డి) ‘చిత్రం’ శ్రీను

► మహేశ్‌బాబు ఉత్తమ నటుడిగా ఎన్నిసార్లు నంది అవార్డు అందుకున్నారు?
ఎ) నాలుగు బి) మూడు సి) రెండు డి) ఐదు

► ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) చదువుకున్న అమ్మాయిలు బి) మూగమనసులుసి) ఇల్లరికండి) మాయాబజార్‌

► ఈ క్రింది ఫోటోలోని అన్నదమ్ములు ఇప్పుడు హీరోలు? వాళ్లెవరు?
ఎ) కళ్యాణ్‌రామ్‌–యన్టీఆర్‌ బి) ఆర్యన్‌ రాజేష్‌–అల్లరి నరేష్‌ సి) కార్తీ–సూర్య డి) రామ్‌చరణ్‌–వరుణ్‌తేజ్‌

► ఫైట్‌ మాస్టర్‌ రామ్‌లక్ష్మణ్‌ల శిష్యుడు వీళ్ల అన్న కుమారుడే. స్టార్‌ హీరోల చిత్రాలకు చేస్తోన్న ఆ యంగ్‌ ఫైట్‌ మాస్టర్‌ పేరు చెప్పుకోండి చూద్దాం?
ఎ) అనిల్‌     బి) వెంకట్‌ సి) విజయ్‌     డి) వినయ్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) డి  2) సి  3) సి  4) బి 5) బి  6) ఎ  7) ఎ  8) ఎ 9) బి  10) డి  11) సి  12) సి 13) ఎ  14) డి  15) బి16) సి  17) బి  18) ఎ19) సి  20) బి
 

మరిన్ని వార్తలు