చార్‌మింగ్‌ పెయిర్‌

30 Mar, 2018 00:39 IST|Sakshi
వెంకటేశ్, నయనతార

మూడు హిట్‌ సినిమాల తర్వాత మారోసారి జోడీ కట్టనున్నారు వెంకటేశ్, నయనయతార. ‘లక్ష్మీ, తులసి, బాబు బంగారం’.. ఇలా మూడు సార్లు సిల్వర్‌ స్కీన్‌పై సందడి చేసి, చార్మింగ్‌ పెయిర్‌ అనిపించుకున్న ఈ జోడీ ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారని సమాచారం.

కేయస్‌ రవీందర్‌ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య ఓ మల్టీస్టారర్‌ మూవీలో యాక్ట్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్‌ సరసన హీరోయిన్‌గా నయనతార పేరుని పరిశీలిస్తుందట చిత్రబృందం. నాగచైతన్య పక్కన హీరోయిన్‌ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో సెట్స్‌ పైకి వెళ్లనుందట.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా