ప్రతి సినిమా పరీక్షే

21 Feb, 2020 00:25 IST|Sakshi
వెంకీ కుడుముల

‘‘నా మొదటి సినిమా ‘ఛలో’ విడుదలయ్యాక, నేను రాసింది నాకే కాదు ఆడియన్స్‌ని కూడా నవ్విస్తుందనే నమ్మకం వచ్చింది. మొదటి సినిమాలానే రెండో సినిమాకి కూడా అదే భయం, నిజాయతీతో పని చేశాను. ప్రతి సినిమా పరీక్షలానే భావించి పని చేస్తాను’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘ఛలో’ సినిమా పూర్తయిన తర్వాత నితిన్‌గారితో సినిమా చేయాలనే కమిట్‌మెంట్‌ ఉంది.

పూర్తి స్క్రిప్ట్‌ రెడీ అయ్యాకే షూటింగ్‌ చేద్దాం అని నితిన్‌గారు చెప్పారు. కొంచెం లేట్‌ అయినా అలానే చేశాం. బౌండ్‌ స్క్రిప్ట్‌ వల్ల చిత్రీకరణ సులువుగా జరిగిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు భీష్మలు ఉంటారు. ఒకరేమో అనంత్‌ నాగ్‌గారు. ఆయన ఒక లక్ష్యం కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మరోవైపు నితిన్‌ పేమించాలనుకున్నా ఎవ్వరూ పడరు. ఆయన పేరు (భీష్మ) వల్లే ఇలా జరుగుతుందని బాధపడుతుంటారు. ఈ ఇద్దరి భీష్మల మధ్య సంబంధం ఏంటి? అనేది సినిమాలో చూడాలి. తదుపరి సినిమా ఇంకా నిర్ణయించుకోలేదు. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లకు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు