కోలాహలం

21 Apr, 2019 00:21 IST|Sakshi
నాగచైతన్య, వెంకటేష్

నవ్వులు, సరదాలు, అలకలు, బుజ్జగింపులతో ‘వెంకీమామ’ ఇంట్లో అంతా కోలహలంగా ఉంది. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కెఎస్‌. రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వెంకీమామ’. వెంకీ సరసన పాయల్‌రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కుటుంబ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్‌ కంప్లీట్‌ కాగానే హైదరాబాద్‌లోనే మరో లొకేషన్‌లో నెక్ట్స్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తారు టీమ్‌. ఈ షెడ్యూల్‌ 15 రోజుల పాటు సాగుతుందని తెలిసింది. ఆల్రెడీ ఫస్ట్‌ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌ను షూట్‌ చేశారు. తాజాగా స్టార్ట్‌ కానున్న నెక్ట్స్‌ షెడ్యూల్‌లో మరో సాంగ్‌ ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. రియల్‌ లైఫ్‌లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లలా నటిస్తున్నారు వెంకీ, నాగచైతన్య. రైతు పాత్రలో వెంకటేశ్, ఆర్మీ ఆఫీసర్‌గా నాగచైతన్య కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు