సంక్రాంతికి ముందే వస్తున్న‘వెంకీమామ’

2 Dec, 2019 20:20 IST|Sakshi

రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. . కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ చిత్రంలో కథానాయికలు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ సినిమా కోసం దగ్గుపాటి, అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా,అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజ‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

నిజానికి ‘వెంకీమామ’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆ సమయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు వస్తుండటంతో విడుదల వాయిదా పడుతుందని అన్నారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తుంది చిత్ర బృందం.

 రానా చెవిలో విడుదల తేది..
గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ‘వెంకీ మామ’ విడుదల తేది గురించి తెగ చర్చ జరిగింది. దీన్నే చిత్ర బృందం సినిమా విడుదల తేది కోసం ఉపయోగించుకుంది. సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తూ హీరో రానా ద‌గ్గుబాటి, డైరెక్ట‌ర్ బాబీ ఓ ఫ‌న్నీ వీడియో విడుద‌ల చేశారు. ‘వెంకీ మామ’పై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రశ్నలను చూసిన రానా.. నేరుగా దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లి అడుగుతాడు. సినిమా విడుదల తేది ఎప్పుడో కనీసం తనకైనా చెవిలో చెప్పమంటాడు. రానా చెవిలో బాబీ విడుదల తేది డిసెంబర్‌ 13 అని చెబుతాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా