‘వెంకీమామ’ విడుదల ఎప్పుడమ్మా

29 Nov, 2019 00:22 IST|Sakshi
వెంకటేష్, నాగచైతన్య

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరి.. ‘వెంకీ మామ’ విడుదల ఎప్పుడమ్మా? అంటూ  నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. జనవరి 14వ తేదీని కూడా పరిశీలిస్తున్నారని టాక్‌. ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత.

మరిన్ని వార్తలు