ఆర్మీ ఆఫీసర్‌.. మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు

24 Nov, 2019 00:26 IST|Sakshi
నాగచైతన్య

‘‘నా మేనల్లుడి లవ్‌స్టోరీ టైటానిక్‌ రేంజ్‌లో ఉంటుంది అనుకుంటే మన ఊర్లో పడవ రేంజ్‌లో కూడా లేదు కదా?’’ అని బాధపడుతున్నారు వెంకీ మామ. మరి ఆయన అల్లుడు అంతలా మామని ఎందుకు నిరుత్సాహపరిచాడో తెలియాలంటే ‘వెంకీ మామ’ సినిమా చూడాలి. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్‌ రవీందర్‌(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. సురేశ్‌బాబు, వివేక్‌ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

శనివారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఆర్మీ ఆఫీసర్‌ శివరామకృష్ణ కార్తీక్‌ పాత్రలో నాగచైతన్య నటించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 13న రిలీజ్‌ కానుందట. అలాగే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమాలో నటిస్తున్నారు. చైతన్య బర్త్‌డే స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది ఈ చిత్రబృందం. ఇందులో మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రలో కనిపించనున్నారు చైతన్య. ఇదిగో ఇక్కడ ఊడుస్తూ కనిపిస్తున్న ఫొటో చూశారుగా. వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు