‘తూనీగ’ డైలాగ్ పోస్ట‌ర్ల‌ విడుదల

2 Aug, 2019 20:30 IST|Sakshi

హైద‌రాబాద్ : వినీత్, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ‘తూనీగ’ చిత్ర డైలాగ్ పోస్ట‌ర్ల‌ను ద‌ర్శకుడు వేణు ఉడుగుల ట్విట‌ర్ ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో రూ పొందిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. నూత‌న ద‌ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ క‌ష్టం ఫ‌లించి, ఈ చిత్ర రూప‌క‌ర్తగా ప్రేక్ష‌కుల నుంచి, విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకోవాలని కోరుకున్నారు. సృజ‌న‌కు ఎల్ల‌లు లేవ‌ని నిరూపించాల‌ని, ఆ దిశ‌గా వేస్తున్న తొలి అడుగు ఫ‌ల‌ప్ర‌దం కావాల‌ని అభిల‌షించారు. ప్రోమో డైలాగ్ రైట‌ర్ ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతిని, డైలాగ్ పోస్ట‌ర్లను అందంగా రూపొందించిన ప్రముఖ ఆర్టిస్టులు గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి, బాబు దండ్రుపెల్లి, ధనుంజ‌య అండ్లూరిని, ఇత‌ర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ త‌ర‌హా వినూత్న ప్ర‌చారం త‌న‌నెంతో ఆక‌ట్టుకుంద‌ని, ముందున్న కాలంలో డిజిట‌ల్ మాధ్య‌మాలు మ‌రిన్ని కొత్త ఆలోచ‌నల‌కు  నాంది కానున్నాయ‌ని, వాటికి సంకేతంగా ఈ పోస్ట‌ర్స్ ఉన్నాయ‌ని విశ్లేషించారు.

డైలాగ్ పోస్ట‌ర్ల విడుద‌ల అనంత‌రం చిత్ర‌బృందం సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌మ ఆనందాన్ని పంచుకుంది. డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు. రిషి ఎదిగ సినిమాటోగ్రఫర్‌గా, ఆర్కే కుమార్ ఎడిట‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రేమ్ పెయింటింగ్స్ పతాకంపై క్రౌడ్ ఫండింగ్ విధానంలో నిర్మిస్తున్నారు. త్వర‌లోనే చిత్ర ఆడియో విడుద‌ల‌కు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర ప‌నుల్లో ఉంది. డైరెక్ట‌ర్ ప్రేమ్ సుప్రీమ్ స్వ‌స్థలం శ్రీకాకుళంతో సహా విశాఖ‌, హైద్రాబాద్, బెంగ‌ళూరు న‌గ‌రాల ప‌రిస‌ర ప్రాంతాల్లో ‘తూనీగ’ తెర‌కెక్కింది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ప‌లువురు నటీన‌టులు ఈ చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా