ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

4 Apr, 2020 08:45 IST|Sakshi

ముంబై : లాక్‌డౌన్‌ కష్టాలు సామాన్యులకే కాకుండా, సెలబ్రిటీలను కూడా వెంటాడుతున్నాయి. ఎక్కడివారు అక్కడ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఇంటి పనులు చేయడానికి సెలబ్రిటీలు నానా తంటాలు పడుతున్నారు. నిత్యం షూటింగ్‌లతో సతమతమయ్యే తారలు ఇంట్లో వంట, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ పనులు చేయడానికి వారు ఏ మాత్రం చిరాకు పడటం లేదు. హాయిగా పనులు చేసుకుంటూ.. వాటిని వీడియో తీసి మరి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే కత్రినా, మలైకా, సల్మాన్‌, సన్నీ లియోన్‌, అనుష్క శర్మ వంటి వారు ఈ పనులను చేయగా తాజాతా మరో బాలీవుడ్‌ హరో విక్కీ కౌశల్‌కు కూడా ఈ కష్టాలు తప్పలేదు. (బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌)

విక్కీ కౌశల్‌.. హాయిగా ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌ను శుభ్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతేగాక ఈ వీడియోలో ‘ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ ఏం అవసరమా’ అని చెబుతున్నాడు. ‘ఈ రోజు నా అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతానని అనుకున్నాను. క్వారంటైన్‌ లైఫ్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తాము ఆరాధించే హీరో యాక్టింగ్‌ మాత్రమే కాకుండా ఇలాంటి పనులు కూడా చక్కగా చేస్తున్నాడని కామెంట్‌ చేస్తున్నారు. (కత్రినా త‌న క్ర‌ష్ కాదంటున్న విక్కీ)

ఇక 2015లో  ‘మాసాన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన విక్కీ కౌశల్‌.. రాజీ, లస్ట్‌ స్టోరీస్‌, సంజు వంటి హిట్‌ చిత్రాల్లోనటించారు. కాగా గతేడాది విక్కీ కౌశల్‌ నటించిన ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఉరి దర్శకుడు ఆదిత్య ధార్‌ తెరకెక్కించనున్న మరో సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో మహాభారతంలోని ఆశ్వత్థామా పాత్రలో నటించనున్నారు. (జోడీ కుదిరిందా?)

మరిన్ని వార్తలు