భయపెడుతూ నవ్వించే దెయ్యం

16 Sep, 2019 00:41 IST|Sakshi
ఓంకార్, అలీ, అశ్విన్‌బాబు, అవికా గోర్‌

‘‘రాజుగారి గది’ రెండు భాగాలు మంచి సక్సెస్‌ అయ్యాయి. సెకండ్‌ పార్ట్‌లో కామెడీ మిస్‌ అయింది అన్నారు. అది దృష్టిలో ఉంచుకొని ‘రాజుగారి గది 3’ కథ రెడీ చేశా’’ అన్నారు దర్శకుడు ఓంకార్‌. ‘రాజుగారి గది’ సిరీస్‌ నుంచి వస్తున్న మూడో సినిమా ‘రాజుగారి గది 3’. అశ్విన్‌బాబు, అవికా గోర్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వెంకటేశ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఓంకార్‌ మాట్లాడుతూ– ‘‘రెండు నెలల్లో సినిమా పూర్తి చేశాం. అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. మా సినిమా వందశాతం ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు.

‘‘మూడేళ్ల తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఓంకార్‌గారు కథ చెప్పగానే థ్రిల్‌ అయ్యాను’’ అన్నారు అవికా గోర్‌. ‘‘ఓంకార్‌ అన్నయ్య నన్ను కొత్త కోణంలో చూపించాడు’’ అన్నారు అశ్విన్‌బాబు. ‘‘ఈ సినిమాలో దెయ్యం ఆహ్లాదంగా నవ్విస్తుంది. భయపెడుతూ నవ్విస్తుంది. ఓంకార్‌ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌. ‘‘భయపడుతూ, నవ్విస్తూ ఉండే సినిమా ఇది. ఆర్టిస్టులకు గౌరవం ఇచ్చి నటన రాబట్టుకుంటారు ఓంకార్‌’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘చిన్నప్పుడు విఠాలాచారి సినిమాలు చూసేవాణ్ణి. ఇప్పుడు ఓంకార్‌ అలాంటి దర్శకుడు’’ అన్నారు నటుడు అలీ.
 

మరిన్ని వార్తలు