‘శ్రీనివాస కళ్యాణం’.. వెంకీ వ్యాఖ్యానం

4 Aug, 2018 15:36 IST|Sakshi

శతమానం భవతి సినిమాతో ఘన విజయం సాధించిన సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పెళ్లి వేడుక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీనియర్‌ హీరో, విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నారు. లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలతో నిరాశపరిచిన నితిన్‌.. శ్రీనివాస కళ్యాణం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, జయసుధ, నందిత శ్వేతలు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు