నవరాత్రి వేడుకల్లో విద్యాబాలన్

21 Oct, 2015 10:59 IST|Sakshi
నవరాత్రి వేడుకల్లో విద్యాబాలన్

ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరోయిన్స్ షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న దుర్గా నవరాత్రి వేడుకల్లో తారల సందడి బాగా కనిపిస్తోంది. ఎప్పుడు మోడ్రన్ డ్రెస్లలో హాట్ హాట్గా కనిపించే తారలు, ట్రెడిషనల్ లుక్లో హుందాగా దర్శనమిస్తున్నారు. ప్రజెంట్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్, ఈ లిస్ట్ ఎక్కువగా కనిపిస్తున్నారు.

బాలీవుడ్ లేడి ఓరియంటెడ్ సినిమాలను సక్సెస్ ఫార్ములాగా మార్చిన విద్యాబాలన్, విశ్వజిత్ ఛటర్జీ కుటుంబం నిర్వహించిన దుర్గమాత పూజలో పాల్గొంది. ప్రస్తుతం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి నటిస్తున్న విద్య ట్రెడిషనల్ లుక్లో అందరినీ ఆకట్టుకుంది. బెంగాలీ తరహా వస్త్రదారణతో విద్యాబాలన్ హుందాగా కనిపించింది.