వారు స్నేహితులు కాదుగా..

7 Aug, 2018 10:50 IST|Sakshi
సంచలన ప్రేమ జంట

తమిళసినిమా: ఈ ప్రేమలో స్నేహం ఉంది అన్నారు యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ. కోలీవుడ్‌లో ఈయన గురించి తెలియని వారుండరు. ఈయన ఫేమ్‌కు కారణం సంచలన నటి నయనతార. ఒక మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందంటారు. విఘ్నేశ్‌శివ ఫేమ్‌ వెనుక నయనతార ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ప్రేమ ఇప్పటికే స్వదేశం దాటి అమెరికా వంటి విదేశాల్లో పలుమార్లు షికార్లు కొట్టొచ్చింది. ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఒకరి పుట్టినరోజున మరోకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం. వాటిని ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో పొందుపరచి ఉచిత ప్రచారం పొందడం ఈ సంచలన జంటకు పరిపాటిగా మారింది.

తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పలువురు ప్రత్యక్షంగానూ, ఫోన్ల ద్వారా,  ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దర్శకుడు విఘ్నేశ్‌ శివ కూడా నయనతారకు తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక ట్వీట్‌ చేశారు. అంతే కాదు తను ఆమె కరములందుకున్న ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. ఇది ప్రేమికుల రోజు కాదు, పైగా వారు స్నేహితులు కాదుగా ఆయన ఆమెకెందుకు శుభాకాంక్షలు  చెప్పారు అనే సందేహం రావచ్చు. అందులో ఆయన ఏం పేర్కొన్నారంటే ఈ ప్రేమలో అపరిమితమైన స్నేహం ఉంది. స్నేహంలోనూ అమితమైన ప్రేమ ఉంది అని పేర్కొన్నారు. ఎంతైనా మాటలు, గీత రచయిత, దర్శకుడు కదా! తన భాషా ప్రావీణ్యాన్ని ఇలా తన ప్రేయసిపై ప్రదర్శించారన్నమాట. ఇప్పుడు ఇదే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా