ఇళయ దళపతి పుట్టిన రోజు కానుకగా!

19 Jun, 2018 11:37 IST|Sakshi

‘మెర్సల్‌’ సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం మురగుదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సూపర్‌ హిట్ కావటంతో హ్యాట్రిక్‌ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. సినిమాలో విజయ్‌ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ రిలీజ్‌కు చిత్రయూనిట్‌ ముహూర్తం ఫిక్స్‌ చేశారు. విజయ్‌ పుట్టిన రోజు(జూన్‌ 22) సందర్భంగా జూన్‌ 21 సాయంత్రం 6 గంటలకు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విజయ్‌ సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపాకిళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

విజయ్‌ ‘సర్కార్‌’ ఫస్ట్‌ లుక్‌!

మరిన్ని వార్తలు