స్క్రీన్‌పై తొలిసారి

4 Aug, 2019 01:41 IST|Sakshi
ఏఆర్‌ రెహమాన్‌

ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ సిల్వర్‌ స్క్రీన్‌ వెనక చాలా ఏళ్లుగా సందడి చేస్తూనే ఉంది. ఆయన మ్యూజిక్‌ని ఇన్నాళ్లూ వింటూనే ఉన్నాం. త్వరలోనే ఆయన్ను సిల్వర్‌ స్కీన్‌ మీద కూడా చూడబోతున్నాం. అయితే పూర్తి స్థాయి పాత్రలో కాదు అతిథి పాత్రలో అని తెలిసింది. అట్లీ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘బిగిల్‌’. అంటే విజిల్‌ అని అర్థం. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మొదటి పాట ‘సింగపెన్నే..’ రిలీజై మంచి విజయం సాధించింది.  ఈ పాటలో విజయ్‌తో కలసి రెహమాన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తారట. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ఇదివరకు రెహమాన్‌ చాలాసార్లు నటించారు. కానీ సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మరిన్ని వార్తలు