మరో హ్యాట్రిక్‌పై గురి!

20 Jul, 2018 01:46 IST|Sakshi
విజయ్‌

నటుడు విజయ్‌ మరో హ్యాట్రిక్‌పై కన్నేశారని కోలీవుడ్‌ సమాచారం. ‘తేరీ, మెర్సెల్‌’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు అట్లీ–హీరో విజయ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ‘సర్కార్‌’ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత విజయ్‌ ఈ సినిమా షూట్‌లో జాయిన్‌ అవుతారని టాక్‌.

ఇక ‘సర్కార్‌’ విషయానికొస్తే..‘కత్తి, తుపాకి’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాల తర్వాత దర్శకుడు మురుగదాస్‌–విజయ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘సర్కార్‌’. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది. ఇటు మురుగదాస్, అటు అట్లీ.. ఇలా వరుసగా హ్యాట్రిక్‌ చిత్రాలపై విజయ్‌ గురిపెట్టడం కోలీవుడ్‌లో ప్రజెంట్‌ హాట్‌ టాపిక్‌గా మారారు.

మరిన్ని వార్తలు