‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న విజయ్‌ దేవరకొండ

28 Aug, 2019 22:33 IST|Sakshi

కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు టాలీవుడ్‌ సెన్సేషన్‌ అండ్‌ క్రేజీ హీరో విజయ దేవరకొండ నిర్మాతగా మారారు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యంగ్‌ టాలెంట్‌కు ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేశాడు. తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ తన సొంత బ్యానర్‌లో సినిమా ప్లాన్ చేశాడు.  ఈ సినిమాకు టైటిల్ కూడా ప్రకటించారు. టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంది. అ టైటిల్‌ పేరు ‘ మీకు మాత్రమే చెప్తా’. అందరికి తెలిసిన పేరు అయినా వినడానికి వెరైటీగా, కొత్తగా ఉంది కదా. టైటిల్‌ను కూడా వెరైటీగా ఓ వీడియో​ద్వారా ప్రకటించాడు విజయ్‌. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. తరుణ్ భాస్కర్ గల్లీ క్రికెట్ ఆడుతుంటే.. విజయ్ దేవరకొండ ఫోన్ చేసి.. ఇప్పుడే కథ విన్నాను. ఆ సినిమాకు నేనే నిర్మాతగా ఉండాలనుకొంటున్నాను అంటే.. అందుకు తరుణ్ భాస్కర్ సమాధానం ఇస్తూ.. మంచి సినిమాలు తీయి అంటాడు. సినిమా పేరు ఏంటని అడగ్గా..‘మీకు మాత్రమే చెబుతాను' అని విజయ్ దేవరకొండ అన్నాడు. నాకే చెప్పు.. మరెవరికీ చెప్పను అంటూ తరుణ్ భాస్కర్ అన్నాడు. కాదురా సినిమా టైటిల్ అదే.. ‘మీకు మాత్రమే చెబుతాను'. ఆ సినిమాలో హీరో కూడా నువ్వే అంటూ తరుణ్‌కు ఝలక్‌ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు