స్టయిలిష్‌ ఫైటర్‌

7 Jan, 2020 05:34 IST|Sakshi
విజయ్‌ దేవరకొండ

పూరి జగన్నాథ్‌ తన తదుపరి చిత్రం ‘ఫైటర్‌’ కోసం విజయ్‌ దేవరకొండను ఫైటర్‌లా మారుస్తున్నారు. ఈ ఫైటర్‌ను ఫీల్డ్‌లో దింపే టైమ్‌ను రెడీ చేసుకున్నారు పూరి. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో పూరి జగన్నాథ్‌ తెరకెక్కించనున్న చిత్రం ‘ఫైటర్‌’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించనున్నారని తెలిసింది. జనవరి 13న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందట. ఎక్కువ శాతం షూటింగ్‌ ముంబైలోనే జరగనుంది.

ఈ సినిమాలో విజయ్‌ వేషధారణ, శరీరాకృతిని సరికొత్తగా డిజైన్‌ చేశారట పూరి. ప్రముఖ బాలీవుడ్‌ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ సినిమాకు పని చేయనున్నారు. సల్మాన్‌ ఖాన్, షాహిద్‌ కపూర్, రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు ‘సాహో’లో ప్రభాస్‌కు స్టయిలింగ్‌ చేశారు ఆలిమ్‌ హకీమ్‌. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌కు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారాయన. ఇప్పుడు విజయ్‌ దేవరకొండకు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ తల్లిగా రమ్యకృష్ణ నటించనున్నారు. ప్యాన్‌ ఇండియా సినిమాగా రిలీజ్‌ కానున్న ఈ సినిమాను పూరి, ఛార్మీ నిర్మిస్తారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

సినిమా

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ