విజయ్‌ దేవరకొండకు 50 కోట్ల బడ్జెటా?

30 Jun, 2019 09:47 IST|Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్‌ దేవరకొండ ఒక్కో సినిమాకు తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంటూ వస్తున్నాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. డియర్‌ కామ్రేడ్‌ పనులు ఇప్పటికే పూర్తి కాగా, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు.

తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న హీరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. కేవలం రెండు బైక్‌ రేసింగ్‌ సన్నివేశాల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.

ఫార్ములా వర్మ ట్రాక్‌ కోసం పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావటంతో పాటు ఫారిన్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లు, కాస్ట్‌లీ బైక్‌లు ఇలా అన్నింటికీ కలిపి భారీగానే ఖర్చయినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈసినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి విజయం ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తాడో లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు