సారీ.. నేను ఉగ్రవాదిని

30 Mar, 2019 01:29 IST|Sakshi
మనోజ్‌ నందం

‘‘ఇండియాకు వ్యతిరేకంగా నడుచుకునే ఉగ్రవాది పాత్ర చేసినందుకు సారీ. నటుడిగా అన్ని పాత్రలను ఒకేలా చూడాలని ఈ పాత్ర చేశాను’’ అన్నారు మనోజ్‌ నందం. సాయికిరణ్‌ అడవి దర్శకత్వంలో ఆది సాయికుమార్, అబ్బూరి రవి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యానరేశ్‌ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్సే నిర్మాతలు. ‘అతడు, ఛత్రపతి’ సినిమాల్లో హీరో చిన్ననాటి పాత్రలు చేసిన మనోజ్‌ నందం ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు.

మనోజ్‌ లుక్‌ను విజయ్‌ దేవరకొండ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ –  ‘‘కేరింత’ సినిమాకు ఆడిషన్‌ ఇచ్చాను. దురదృష్టవశాత్తు సెలెక్ట్‌ కాలేదు. మనోజ్, అబ్బూరి రవిగారి లుక్స్‌ నచ్చాయి’’ అన్నారు. ‘‘బిజీగా ఉన్నప్పటికీ లుక్‌ రిలీజ్‌ చేయడానికి అంగీకరించిన విజయ్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు సాయికిరణ్‌ అడవి. ‘‘ఫస్ట్‌ టైమ్‌ బ్యాడ్‌బాయ్‌ పాత్రలో నటించాను. ఆడియన్స్‌ నన్ను విలన్‌గా యాక్సెప్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు మనోజ్‌.

మరిన్ని వార్తలు