అలాంటి సినిమాలు ప్రభాస్‌ అన్నే చేయాలి..

16 Oct, 2019 16:24 IST|Sakshi

గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కూడా అనువాద చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. జేమ్స్ బాండ్, అవెంజర్స్, టెర్మినేటర్, లాంటి యాక్షన్ మూవీ సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా టెర్మినేటర్ సిరీస్‌లోని ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్నారు. నవంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను సెన్సేషనల్  స్టార్‌ విజయ్ దేవరకొండ బుధవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమా చూశానని చెప్పాడు. అప్పట్లో ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేసేవాళ్లమని తెలిపాడు.  ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల తెలుగు డబ్బింగ్ చూస్తే ఇరిటేషన్ వచ్చేదని.. ఇప్పుడు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగా పెరిగిందన్నాడు. ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’లో డబ్బింగ్ చాలా బాగున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోందన్నారు. తను ఇంకా చిన్నవాడినని.. ప్రభాస్‌ లాంటి వారు టెర్మినేటర్‌ లాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.  తెలుగులోకి హాలీవుడ్ సినిమాల‌ను తీసుకొస్తున్న డిస్నీ సంస్థ మ‌న ‘సాహో’, ‘సైరా’, ‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ వంటి సినిమాలను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలి’ అని విజయ్ దేవరకొండ అన్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రొమాంటిక్’లో రమ్య‌కృష్ణ‌

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో మూవీ!

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌

డెబ్భై నిండిన డ్రీమ్‌ గర్ల్‌

ఖైదీ యాక్షన్‌

అతిథి వస్తున్నారు

మళ్లీ జంటగా..

బర్త్‌డేకి ఫిక్స్‌

కమల్‌ కూతురికి గిల్టీగా లేదా?

అమ్మో.. ఛోటానా? అంటారు

బిగ్‌బాస్‌ : శివజ్యోతి ప్లాన్‌ సక్సెస్‌ అయినట్టేనా!

పండగలా.. ప్రతిరోజూ పండగే

ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్‌!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌!

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

రేటు పెంచిన ‘గద్దలకొండ గణేష్‌’

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌

వెండితెర గ్రౌండ్‌లో...

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది

లేడీ పోలీస్‌

బంపర్‌ ఆఫర్‌

పరమ వీర

కొత్త నాగశౌర్యను చూస్తారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రొమాంటిక్’లో రమ్య‌కృష్ణ‌

అలాంటి సినిమాలు ప్రభాస్‌ అన్నే చేయాలి : విజయ్

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌