‘ఎఫ్‌ఐఆర్‌’ను విడుదల చేయనున్న విజయ్‌

29 Jun, 2020 19:53 IST|Sakshi

అల్లరి నరేశ్‌ హీరోగా విభిన్న పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. నరేశ్‌కు హీరోగా 57వ చిత్రమైన ‘నాంది’ని ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. రేపు (మంగళవారం) అల్లరి నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌ ఇంపాక్ట్‌ రీవీల్‌(ఎఫ్‌ఐఆర్‌) అంటే చిన్నపాటి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘నాంది’ అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌కు ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌. 

నాంది ఎఫ్‌ఐఆర్‌ను టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సం​స్థ అధికారికంగా ట్విటర్‌లో ప్రకటించింది. మంగళవారం ఉదయం 9:18 గంటలకు ఫస్ట్‌ ఇంపాక్ట్‌ రివీల్‌ను విజయ్‌ విడుదల చేయనున్నారని తెలిపింది. దీంతో టాలీవుడ్‌లో అందరి దృష్టి ‘నాంది’ పైకి వెళ్లింది. ఇక ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో పోలీస్‌ స్టేషన్‌లో బట్టలు లేకుండా నగ్నంగా ఆందోళనంగా కూర్చొని హీరో కనిపిస్తాడు. ఇక హీరోతో పాటు చిత్రంలోని నటీనటుల పరిచయం చేస్తూ చిత్ర బృందం పలు పోస్టర్లను విడుదల చేసింది. నవమి, ప్రవీణ్‌, ప్రియదర్శి, దేవీప్రసాద్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకాల సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు