ప్రేమ కథ పట్టాలెక్కింది

20 Oct, 2018 00:57 IST|Sakshi

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, సెన్సిబుల్‌ దర్శకుడు క్రాంతి మాధవ్‌ కాంబినేషన్‌లో ఓ లవ్‌స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ముహూర్తం జరుపుకుంది. ఈ సినిమాను క్రియేటీవ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేయస్‌ రామారావు సమర్పణలో కేఎస్‌ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసాబెల్లె హీరోయిన్స్‌గా కనిపించనున్నారు.

హీరో, హీరోయిన్స్‌పై కళాబంధు టి. సుబ్బరామి రెడ్డి క్లాప్‌ కొట్టగా, నిర్మాత అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అశ్వినీదత్, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సి. కల్యాణ్, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌. 

మరిన్ని వార్తలు