సినిమాలు చూసి ఓటు వేయరు : విజయ్‌ దేవరకొండ

3 Oct, 2018 00:18 IST|Sakshi
మెహరీన్, విజయ్‌ దేవరకొండ, జ్ఞానవేల్‌ రాజా, కొరటాల శివ 

‘‘నోటా’ లాంటి వైవిధ్యమైన సినిమా తీసినందుకు జ్ఞానవేల్‌ రాజాగారికి థ్యాంక్స్‌. ‘పెళ్ళి చూపులు’ సినిమా చూసినప్పుడు విజయ్‌ కోసం ఓ కథ రాయాలనుకున్నా. ‘అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం’, ఇప్పుడు ‘నోటా’.. ఇవన్నీ చూస్తుంటే మంచి కథతో విజయ్‌ దగ్గరికి వెళ్లాలని డిసైడ్‌ అయ్యాను.  తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్‌తో వెళతా’’ అని డైరెక్టర్‌ కొరటాల శివ అన్నారు. విజయ్‌ దేవరకొండ, మెహరీన్‌ జంటగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ çపతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నోటా పబ్లిక్‌ మీట్‌’లో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఇంత పవర్‌ఫుల్‌ సినిమా తీసిన ఆనంద్‌ శంకర్‌కి ఆల్‌ ది బెస్ట్‌. మొదటి సినిమా నుంచి ఆనంద్‌ చూపిస్తున్న వేరియేషన్స్‌ బాగున్నాయి. విజయ్‌కి అరుదైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ దక్కింది’’ అన్నారు.

జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ సినిమాను తమిళనాడులో రిలీజ్‌ చేసాం. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నాన్‌ ‘బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టిన సినిమా ‘గీత గోవిందం’. ఇలాంటి రికార్డులను సాధించడం ఒక్క విజయ్‌కే దక్కింది. ఇక్కడ తనకి హార్డ్‌ కోర్‌ ఫాన్స్‌ ఉన్నట్లే తమిళనాడులోనూ ఉన్నారు’’ అన్నారు. ‘‘నోటా’ సినిమా చాలా బాగుంటుంది. చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు మెహరీన్‌. ‘‘ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రలో కనిపించే విజయ్‌ బయట చాలా హానెస్ట్‌గా ఉంటాడు’’ అన్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నోటా’ సినిమా రిలీజ్‌ ఆపేయాలని అఫిడవిట్లు పెడుతున్నారు. ఎలక్షన్స్‌ టైమ్‌లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా చూసి అందరూ నోటా బటన్‌ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ఇష్యూస్‌ ఈ సినిమాలో లేవు. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. కౌంట్‌ డౌన్‌ మొదలైంది.. 5న థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు