కాలేజీలో కామ్రేడ్‌

1 Dec, 2018 00:32 IST|Sakshi
విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన కెరీర్‌కు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఎంత మైలేజ్‌ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులో మెడికల్‌ స్టూడెంట్‌గా నటించారు విజయ్‌. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... విజయ్‌ హీరోగా ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కాకినాడలోని ఓ మెడికల్‌ కాలేజీలో జరుగుతుందని సమాచారం. అంటే విజయ్‌ మళ్లీ మెడికల్‌ స్టూడెంట్‌ పాత్ర చేస్తున్నారా? లేక మెడికల్‌ కాలేజీలోని స్టూడెంట్స్‌తో సినిమాలో ఏదైనా ఎమోషనల్‌ సీన్స్‌ ప్లాన్‌ చేశారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌.

ఈ సినిమాలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో క్రికెటర్‌గా కనిపిస్తారామె. భరత్‌ కమ్మని దర్శకునిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్, యశ్‌ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్‌లో వెండితెరపైకి రానుంది. ఈ సినిమా కాకుండా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటించనున్న సినిమా రెగ్యులర్‌ షూట్‌ జనవరిలో స్టార్ట్‌ కానుందని టాక్‌.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ సులభం కాదు

అమెరికాలో అతను డాక్టర్‌ కపూర్‌

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు