ప్రేమకథ

13 Oct, 2018 05:49 IST|Sakshi
విజయ్‌ దేవరకొండ

‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ చిత్రాల ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతిమాధవ్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ‘ఓనమాలు, మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు, ఉంగరాల రాంబాబు’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు క్రాంతిమాధవ్‌. వీరి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్‌ సంస్థ ప్రొడక్షన్‌ నెం.46గా నిర్మించనున్న కొత్త సినిమా ఈనెల 18న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం  రోజునే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రయూనిట్‌ తెలియజేయనుంది. ప్రేమకథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లెడి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జేకే.

మరిన్ని వార్తలు