కియారా అద్వానీకి ‘అర్జున్‌‌ రెడ్డి’ గిఫ్ట్‌

1 Jul, 2019 15:03 IST|Sakshi

విమర్శకులు ‘కబీర్‌ సింగ్‌’ను వేలెత్తి చూపిస్తున్నా కలెక్షన్స్‌లో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. భారీ వసూళ్లతో బ్లాక్‌ బస్టర్‌హిట్‌గా నిలిచిన కబీర్‌ సింగ్‌.. త్వరలోనే రెండు వందల కోట్లను కలెక్ట్‌ చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 170కోట్లను కలెక్ట్‌ చేసింది. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీల నటనకు ప్రశంసలు లభించాయి.

అయితే ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్‌ అయినందుకు విజయ్‌ దేవరకొండ.. కబీర్‌సింగ్‌కు కంగ్రాట్స్‌ చెబుతూ కియారా అద్వాణీకి ఓ గిఫ్ట్‌ను ప్రజెంట్‌ చేశాడు. ఆ గిఫ్ట్‌ను కియారా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘కబీర్‌ సింగ్‌ హిట్‌ అయినందుకు కంగ్రాట్స్‌ కియారా.. ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేయ్‌.. నా ఆనందంతో పాటు.. నా బట్టలను పంపుతున్నాను.. ఇలా అంటే ఏదో తప్పులా వినిపిస్తుంది కదా.. నా బ్రాండ్‌ దుస్తులను పంపాను’  అని తెలిపాడు. ఈ విషయాన్ని కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘థ్యాంక్యూ అర్జున్‌’ అని తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు